bapatlanews.com
సభాధ్యక్షత వహించిన విజన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. హెచ్. శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ వెబ్ సైట్ నిర్వహణలో పాటించవలసిన సూత్రాలను తెలియజేసారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ తిమ్మన శ్యాం సుందర్ సైట్ గురించి వివరించారు. గౌరవ అతిధిగా పాల్గొన్న వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. సుబ్బారావు కమ్యునికేషన్ విధానాల గురించి సోదాహరణంగా వివరించగా, ఆత్మీయ అతిధిగా పాల్గొన్న విజన్ ఇన్స్టిట్యూట్ కళాశాల కంప్యుటర్ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రాజ గోపాల్, రామ సాఫ్ట్ వేర్ కన్సల్టంట్ అధిపతి పి. రామకుమార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్సైట్ల గురించి వివరించడమే కాక బాపట్ల వెబ్ సైట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు ఏలేశ్వరపు నరసింహారావు బాపట్ల విశిష్టతను వివరించగా, రెడ్ క్రాస్ కార్యదర్శి నారాయణ భట్టు ప్రస్తుత వ్యాపార ధోరణితో సాగుతున్న పత్రికలకు భిన్నంగా ఈ వెబ్ సైట్ ప్రజల అభిమానాన్ని పొందాలని అభిలషించారు. ఈ కార్యక్రమ సభా నిర్వహణ చేసిన "విశ్వ విఖ్యాత సభా వ్యాఖ్యాత", "సభ సమ్రాట్" డాక్టర్ కే. వి.యస్. ఆచార్య ఆచ్చ తెలుగు నుడికారాలతో ఆద్యంతం సభికులను రంజింపజేశారు. వెబ్ సైట్ విజయవంతం కావాలని, అనేక ఇతర వెబ్ సైట్ల ఆవిర్భావానికి ఈ వెబ్ సైట్ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు. చివరిగా వెబ్ సైట్ చీఫ్ ఎడిటర్ కే.ఆర్.కే.భరద్వాజ ఈ వెబ్ సైట్ ను రూపొందించడంలో తనకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.