కార్తిక పౌర్ణమి తొలి వెలుగులో ..ఆ శివుని ప్రియా సన్నిధిలో .......
వెచ్చని దీపాల మధ్య , చల్లని చిరుగాలి మధ్య ........
ఆ నిండైన వెన్నెల ని చూసాను. కానీ నా గుండె గుడిలో నిదురించే నా వెన్నెలని చూసే అదృష్టం కోసం తపిస్తుంటే , ఆ శివుడు నా మొర ఆలకించాడో లేదో కానీ నా కల నిజం చేసాడు. తనని నా ఎదుట నిలిపాడు. క్షణ కాలం కలోఇలో తేల్చుకోలేక పోయాను .
గుండె లో తను రాజేసిన నిప్పుతో , తన లేలేత నవ్వులకు మెరిసిన నా కళ్ళతో తనని చూడాలని ఎగసెగసి పడుతున్న నా మది ని అదిమి పట్టుకొని , తన వైపు తేరి పార చూసాను . ఆ క్షణం , తిరిగిరాలేని ఆ ఒక్క క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండు అనిపించింది .
తన మోము, చురకత్తుల చూపు చూసి మైమరిచిన ఆ క్షణం తిరిగి ఎలా వస్తుంది. అన్నింటి కన్నా తన చిరు పెదాలపై నీలాకాశం లో చంద్రుని పక్క చుక్క లా మెరిసే ఆ పుట్టు మచ్చ ని నేనెలా మరువగలను. కనుల ముందు తన రూపం , కనుల వెనుక తన జ్ఞాపకం , మది లో తన ప్రతిబింబం నిలిచిన ఆ క్షణం నేనెలా మరువగలను.
తన చూపు వదిలి వెళ్లి పోతున్నప్పుడు నా మది ఎంతగా ఎగసి పడిందో , తన నవ్వు ఇక చూడలేనని తెలిసిన నా మనసు ఎంతగా బాధ పడిందో నా చెమ్మ గిల్లిన కళ్ళను చుస్తే తెలుస్తుంది ..........